భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇమిటేట్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ స్టాన్స్, బ్యాటింగ్ స్టైల్‌ను విరాట్ కోహ్లీ ఇమిటేచ్ చేశాడు. ధావన్, కోహ్లీ ఇద్దరూ ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కలసి ఆడుతున్నారు.
‘శిఖర్ ధావన్ ఈ మధ్య కాస్త అయోమయంగా కనిపిస్తున్నాడు కాబట్టి నేను శిఖర్ ధావన్‌ను అనుకరిస్తున్నాను. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే తను బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఎన్నోసార్లు అవతలి ఎండ్‌లో ఉండి చూశాను. కాబట్టి నేను ఇది చేస్తున్నాను.’ అని విరాట్ కోహ్లీ.. ధావన్ స్టైల్‌ను కాపీ కొట్టేముందు అన్నాడు.
విరాట్ కోహ్లీ తన సహచర జట్టు సభ్యులను ఇమిటేట్ చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలా చేశాడు. విరాట్ కోహ్లీ.. గతంలో హర్బజన్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన వీడియోను కూడా ఇప్పుడు ఒక అభిమాని పోస్ట్ చేశాడు. ఒకసారి ఆ వీడియోను కూడా చూడండి.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు లభించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి యువ క్రికెటర్లకు సెలక్టర్లు ప్రాధాన్యతను ఇచ్చారు. సంప్రదాయ బద్ధంగా బ్యాటింగ్ చేసే వారికి సెలక్టర్లు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే శిఖర్ ధావన్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదని స్పోర్ట్స్‌కీడా తన కథనంలో పేర్కొంది.
Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్ గంభీర్
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?