ఐపీఎల్‌ ఫైనల్లో ఓటమి పాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ అండగా నిలిచాడు. విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు అభినందనలు తెలియజేశాడు. వారితో పోలిస్తే ఫైనళ్లలో కేకేఆర్‌ ఎక్కువ విజయవంతమైన జట్టని సున్నితంగా విమర్శించాడు.


Also Read: 17 ఏళ్ల తర్వాత పాక్ లో టీం ఇండియా పర్యటన... ఆసియా కప్ 2023 హోస్టింగ్ హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్..!


'చెన్నై సూపర్‌కింగ్స్‌కు అభినందనలు! కోల్‌కతా నైట్‌రైడర్స్ బాధపడకండి. మనం మూడు ఫైనళ్లలో రెండు గెలిచాం. మీరు తలెత్తుకోండి! ' అని గౌతీ ట్వీట్‌ చేశాడు. కాగా మ్యాచుకు ముందు అతడు కేకేఆర్‌కు మద్దతుగా మాట్లాడాడు. ఆ జట్టు విజయం సాధిస్తుందని అంచనా వేశాడు.


Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా


'ఒకసారి మీరు డేటా చూడండి. డేటా, అంకెలను చూశాక మన (కేకేఆర్‌)తో పోలిస్తే వాళ్లే (సీఎస్‌కే) పెద్ద చోకర్స్‌ అని  నా జట్టుకు చెబుతాను. ఎందుకంటే వారు ఎనిమిది ఫైనళ్లు ఆడి నాలుగే గెలిచారు. మనం రెండు ఆడితే రెండూ గెలిచాం. ఒత్తిడిలో వారు మనకన్నా ఎక్కువగా చిత్తయ్యారు' అని గంభీర్‌ అన్నాడు. వందశాతం కష్టపడితే ఫైనల్లో విజయం సాధించగలమని వెల్లడించాడు.


ఏదేమైనా గంభీర్‌ అంచనాలు తలకిందులయ్యాయి. చెన్నై చేతిలో కేకేఆర్‌ పరాజయం చవిచూసింది. ధోనీసేన నాలుగో ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన ఆ జట్టు తిరిగి అందరి ముందు విజేతగా నిలబడింది. ధోనీ తనలో నాయకత్వ సత్తా తగ్గలేదని చాటి చెప్పాడు.


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి