కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తే రానున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో సమర్థమైన నాయకత్వం లేదని అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, వచ్చే ఏడాది రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలు ఏజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు.
Also Read: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు... నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు
సీనియర్ల రచ్చ సరికాదు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ప్రారంభ ఉపన్యాసంలో సోనియా గాంధీ పలు సంకేతాలు, సూచనలు చేశారు. సోనియా గాంధీ అధ్యక్షతన దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతోన్న సమావేశంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలు డిమాండ్ చేస్తూ సోనియాకు లేఖ రాసిన సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ల రచ్చపై సోనియా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సీనియర్లు కొందరు సంస్థాగత ఎన్నికల విషయమై బయట వేరే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సీబ్ల్యూసీ భేటీపై మీడియాతో మరో రకంగా మాట్లాడం సరికాదని సోనిమా గాంధీ అన్నారు. పార్టీ పదవులకు ఎన్నిక అనివార్యమన్న విషయం తనకు తెలుసన్న ఆమె... 2019 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉంటున్నానన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలిగా తానే ఉంటానని సోనియా స్పష్టం చేశారు.
Also Read: 25వేల బిస్కెట్లు... 24 అడుగుల మస్కట్... తయారు చేయడానికి 15 గంటల సమయం
లఖింపుర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం
పార్టీ నేతలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించే సందర్భం వచ్చిందన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన ఘటనపై సీడబ్ల్యూసీ సమావేశంలో విచారం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలపై బీజేపీ ఆలోచనకు లఖింపుర్ ఘటన నిదర్శనమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దులో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.
Also Read: బాణసంచా నిషేధ బాటలో రాష్ట్రాలు .. ఆ పని చేయవద్దని సీఎం స్టాలిన్ లేఖలు !