వినాయక చవితి సమయంలో పలువురు భక్తులు డ్రై ఫ్రూట్స్, ధాన్యాలు, చాక్లెట్ తదితరాలతో గణేశ్ బొమ్మలు చేసి అలరించారు. ఇప్పుడు నవరాత్రుల వంతు వచ్చింది. దీంతో పలువురు ఆర్టిస్టులు తమలోని ప్రతిభను మరోసారి బయటకు తీస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ ఆర్టిస్టు 25వేల బిస్కెట్లు ఉపయోగించి 24 అడుగుల Theyyam మస్కట్‌ని రూపొందించాడు.
కేరళకు చెందిన సురేశ్ పీకే బేకరీలో దొరికే ఫుడ్ ఐటమ్స్‌తో ఈ మస్కట్ తయారు చేశాడు. సురేశ్‌ని స్థానికులు ‘DaVinci’ Suresh అని కూడా పిలుస్తుంటారు. ఒక పెద్ద హాలులో సురేశ్ ముందుగా కొన్ని టేబుల్స్ పరిచాడు. ఆ తర్వాత కన్నూర్‌లోని ఓ బేకరీలో రంగు రంగుల బిస్కెట్లు, స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్స్‌తో ఈ మస్కట్‌ని తీర్చిదిద్దాడు. దీన్ని రూపొందించడానికి సుమారు 15 గంటల సమయం పట్టినట్లు సురేశ్ తెలిపాడు. ఈ ఫొటోని సురేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని చూసిన వారు... ఎంత సహజంగా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనంతరం ఈ చిత్రం తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నింటినీ ఓ జంతుశాలకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Also Read: తొమ్మిది రంగుల నవరాత్రి... ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి... ఆ రంగు ప్రత్యేకత ఏంటి?
గతంలోనూ సురేశ్... మాస్కులతో అమితాబ్ బచ్చన్, పువ్వులతో సామాజిక వేత్త శ్రీ నారాయణ గురు, బంగారంతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రజనీకాంత్ బొమ్మలను కూడా వేశాడు. నార్త్ కేరళలో తెయ్యం... కలియట్టం అని కూడా పిలుస్తుంటారు. తెయ్యం డ్యాన్స్ అక్కడ ఎంతో ఫేమస్. బాగా మేకప్ వేసుకుని, బరువైన ఆభరణాలు ధరిస్తారు ఈ నాట్యం వేసేవాళ్లు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి