దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. కొవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ కేసులు పెరిగాయి. ఇటీవల కరోనా కేసుల సంఖ్య 20 వేలకు దిగువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,981 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా 166 మంది మరణించారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండూ తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. నిన్నటి కేసుల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో 8867 కరోనా కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ  97,23,77,045 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. 






Also Read: బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు


పెరిగిన రికవరీ రేటు


కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,53,573గా ఉన్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య 4,51,980కు చేరింది. తాజాగా కరోనా నుంచి 17,861 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,33,99,961కు చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,01,632 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు 98 శాతానికి పైగా పెరిగింది.


Also Read: ఎంపీ డేవిడ్ అమీస్ హత్య ఉగ్రవాదుల పనే.. లండన్ పోలీసుల ప్రకటన !


Also Read: గ్రీన్‌ టీతో కోవిడ్‌ను అరికట్టవచ్చా? IISER శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తేలింది?


Also Read: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి