ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19తో పోరాడేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు. వైరస్‌ను అడ్డుకోడానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ సైతం కనుగొన్నారు. కరోనాను పూర్తిగా తరిమేందుకు ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా భోపాల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) శాస్త్రవేత్తల బృందం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 


పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు కోవిడ్-19, వృద్ధాప్యం, మధుమేహం మధ్య జీవ అణువు సంబంధాలను గుర్తించారు. మాలిక్యులర్, సెల్యులార్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించబడిన సమీక్ష ప్రకారం.. మధుమేహం, ఊబకాయం, వృద్ధాప్య చికిత్సలకు ఉపయోగించే మందులు.. కోవిడ్-19 చికిత్సకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ టీ వంటి మొక్కల ఆధారిత ఆహారంలో ఉండే పాలీఫెనాల్స్, రెస్వెరాట్రాల్ సమ్మేళనాల్లో వైరల్ నిరోధక లక్షణాలు ఉంటాయని భోపాల్‌లోని ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (IICE), IISER‌ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అమ్జాద్ హుస్సేన్ తెలిపారు. కర్కుమిన్ సమ్మేళం పసుపులో, రెస్వెరాట్రాల్ సమ్మేళనం ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ రెండూ గ్రీన్ టీలోనే లభిస్తాయన్నారు. 


Also Read: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?


గ్రీన్ టీ, కోకో, బెర్రీస్‌లో ఉండే క్యాటెచిన్.. యాపిల్స్, దాల్చినచెక్క, ద్రాక్ష తొక్కలో ఉండే ప్రొసైనిడిన్‌లు, బ్లాక్ టీలో ఉండే థిప్లేవీన్‌లను కోవిడ్-19 చికిత్సతోపాటు మధుమేహం, వృద్ధాప్యం వంటి కొమొర్బిడిటీ పరిస్థితులకు ఉపయోగకరంగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్‌తోపాటు మధుమేహం, వృద్ధాప్య సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉందని, వీటి వల్ల బాధితుల్లో ఆక్సీకరణ ఒత్తిడి, రోగనిరోధక ప్రతిస్పందన సమస్య, గుండె సంబంధిత రోగాలు,   కంటి వ్యాధులు, నరాలవ్యాధి, నెఫ్రోపతి (మూత్రపిండ సమస్యలు) వంటి వ్యాధులకు దారి తీస్తాయన్నారు. కణ త్వచాలలో ఉండే లిపిడ్లు కరోనావైరస్ సంక్రమణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు. కాబట్టి.. కోవిడ్‌కు బయపడకుండా.. పరిశోధకులు పేర్కొన్న గ్రీన్ టీతోపాటు యాపిల్స్, దాల్చిన చెక్క, ద్రాక్స, పసుపు వంటివి మీ రోజువారి ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. 


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?


Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి