బ్యాంకుల్లో మీకేమైనా పనులుంటే త్వరగా పూర్తి చేసుకోండి! ఎందుకంటే పండుగల సీజన్‌ కాబట్టి ఇకపై బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రకారం అక్టోబర్‌ 12 నుంచి దేశంలోని కొన్ని నగరాల్లో వరుసగా 9 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లోని సంస్కృతులను బట్టి ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.


సెలవులు ఇవే:
అక్టోబర్‌ 12- దుర్గా పూజా సప్తమి నేపథ్యంలో అగర్తలా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు
అక్టోబర్‌ 13- మహాష్టమి సందర్భంగా అగర్తలా, కోల్‌కతా, భువనేశ్వర్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, పట్నా, రాంచీలో సెలవు
అక్టోబర్‌ 14- దుర్గానవమి సందర్భంగా అగర్తలా, భువనేశ్వర్‌, కోల్‌కతా, గ్యాగ్‌టక్‌, గువాహటి, కాన్పూర్‌, లఖ్‌నవూ, షిల్లాంగ్‌, శ్రీనగర్‌, తిరువనంతపురం, పట్నా, రాంచీలో సెలవు
అక్టోబర్‌ 15- దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇంఫాల్‌, షిమ్లాలో మాత్రం పనిచేస్తాయి.
అక్టోబర్‌ 16- దుర్గా పూజ నేపథ్యంలో గ్యాంగ్‌టక్‌లో సెలవు
అక్టోబర్‌ 17- ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు
అక్టోబర్‌ 18- కటిబిహూ సందర్భంగా గువాహటిలో సెలవు
అక్టోబర్‌ 19- ఈద్‌ ఈ మిలాద్‌ నేపథ్యంలో అహ్మదాబాద్‌,బెలాపూర్‌, భోపాల్‌, చెన్నై, డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, ఇంఫాల్‌, జమ్ము, కాన్పూర్‌, కోచి, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్‌, దిల్లీ, రాయ్‌పుర్‌, రాంచీ, శ్రీనగర్‌, తిరువనంతపురంలో సెలవు
అక్టోబర్‌ 20- అగర్తలా, బెంగళూరు, చండీగఢ్‌, కోల్‌కతా, షిమ్లాలో సెలవు


భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకారం అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు ఏకంగా 21 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల సంస్కృతులు, పండుగలను బట్టి సెలవులు ఇచ్చారు. ఏయే రోజుల్లో సెలవులు ఇచ్చారంటే...!


అక్టోబర్‌ 3, 9, 10, 17, 23, 24, 31న వారాంతపు (ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు) సెలవులు. అక్టోబర్‌ 1న బ్యాంకులకు అర్ధవార్షిక సెలవు (గ్యాంగ్‌టక్‌), 2న గాంధీ జయంతి,  6న మహాలయా అమావాస్య (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా), 7న మెరా చావోరెన్‌ హౌబా (ఇంఫాల్‌), 12న దుర్గా పూజ , మహా సప్తమి (అగర్తలా, కోల్‌కతా), 13న మహా అష్టమి (అగర్తలా, భువనేశ్వర్‌, గ్యాంగ్‌ టక్‌, గువాహటి, ఇంఫాల్‌, కోల్‌కతా, పట్నా, రాంచీ), 14న మహా నవమి, దసరా, ఆయుధ పూజ (అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్‌, గువాహటి, కాన్పూర్‌, కోచి, కోల్‌కతా, లక్‌నవూ, పట్నా, రాంచీ, షిల్లాంగ్‌, శ్రీనగర్‌, తిరువనంతపురం), 15న విజయ దశమి, దసరా (ఇంఫాల్‌, షిమ్లా మినహా దేశవ్యాప్తంగా), 16న దుర్గాపూజ-దసైన్‌ (గ్యాంగ్‌టక్‌), 18న కాటిబిహూ (గువాహటి), 19న ఈద్‌ ఈ మిలాద్‌ /మిలాద్‌ ఈ షెరిఫ్‌, 20న మహారుషి వాల్మీకీ జయంతి, లక్ష్మీపూజ, ఈద్‌ ఈ మిలాడ్‌ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్‌, కోల్‌కతా, షిమ్లా), 22l ఈద్‌ ఇ మిలాద్‌ ఉల్‌ నబీ (జమ్ము, శ్రీనగర్‌), 26న యాక్సెషన్‌ డే (జమ్ము, శ్రీనగర్‌)


Also Read: మళ్లీ షాక్! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..


Also Read: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు!