దేవీ నవరాత్రులైన, నోములైనా, వ్రతాలైనా చాలా మందికి ఉపవాసం చేసే అలవాటు ఉంది. హిందూ సాంప్రదాయంలో ఉపవాసానికి ఓ పరమార్థం ఉంది. కానీ చాలా మందికి ఉపవాసం అంటే ఏమీ తినకపోవడం అని మాత్రమే తెలుసు. దీక్ష ముగిశాక పొట్టనిండా తినేస్తారు. నిజానికి ఉపవాసం ఉండేవాళ్లు కొన్ని ఆరోగ్యనిమయాలు పాటించాలి. లేదంటే అనారోగ్య బారిన పడేఅవకాశం ఉంది. ఉపవాసం చేసేటప్పులు ఏం చేయాలో; ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం...
నెలకో రోజు మంచిదే...
ఉపవాసం కేవలం దైవారాధనకే కాదు, ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. అప్పుడప్పుడు ఇలా ఏమీ తినకుండా కొంతసేపు ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. కాబట్టి నెలలో ఒక రోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తే చాలా మంచిది.
నిర్జలోపవాసం వద్దు
ఉపవాసాల్లో నిర్జలోపవాసం ఒకటి. అంటే కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఆహారం కొన్ని గంటల పాటూ తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ, నీరు తాగకపోతే ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం. శరీరానికి గాలి తరువాత అత్యవసరమైనది నీరు. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవాలన్నా నీటితోనే సాధ్యం.
ఉత్త నీళ్లే కాదు...
కొంతమంది ఉదయం నుంచి రాత్రి పొద్దు పొడిచే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు. కేవలం నీటితోనే గడిపేవారు కూడా ఉంటారు. ఇలా అధిక సమయం నీరు ఒక్కటే తాగుతూ ఉండకూడదు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఓసారి, తేనే ఓసారి ఇలా కలుపుకుని తాగొచ్చు. మధ్యలో గ్లూకోజ్ కూడా తాగితే మంచిదే. ఇలా చేయడం వల్ల వ్యర్థాలు బయటికి పోవడమే కాకుండా, అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బీపీ, షుగర్ ఉన్న వాళ్లు...
భక్తి గుండెల్లో ఉన్నా చాలు ఆ దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. హైబీపీ, మధుమేహం ఉన్నవాళ్లు అధిక సమయాల పాటూ ఉపవాస దీక్షలు చేపట్టడం మంచిది. ఒక వేళ తప్పదను కుంటే వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం,తేనె కలుపుకుని తాగొచ్చు. ఎందుకంటే తేనెలో ఉండే తీసి ఒకేసారి రక్తంలో చేసి షుగర్ స్థాయులను పెంచదు. కొంచెంకొంచెంగా శక్తినిస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం