Bangladesh: బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు

ABP Desam Updated at: 16 Oct 2021 09:49 AM (IST)

బంగ్లాదేశ్‌లోని నౌఖాలీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అక్కడ దసరా వేడుకల్లో పాల్గొన్న భక్తులను భయబ్రాంతులకు గురి చేశారు.

isckon

NEXT PREV

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, భక్తులపై దాడులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తరచూ ఇలాంటి సంఘటన తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 
చాలా ప్రాంతాల్లో ఇలా మతపరమైన అల్లర్లు సృష్టించడం చాలా సర్వసాధారణమైపోతోంది. 24గంటల వ్యవధిలోనే ఇలాంటి దాడులు రెండు చోట్ల జరిగాయి. దుర్గా పూజ సందర్భంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రోజే దసరా సందర్భంగా ఏకంగా ఎంతో ప్రఖ్యాతమైన ఇస్కాన్ టెంపుల్‌పై దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
నోఖాలి ప్రాంతంలోని ఇస్కాన్ దేవాలయంలో భక్తులపై దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఇందులో చాలా మంది భక్తులు గాయపడ్డారు. ఆలయ ఆస్తి బాగా  దెబ్బతింది. విధ్వంసానికి గురైన ఆలయ చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకుంది ఇస్కాన్ టెంపుల్. భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. దుండగుల దాడిలో గాయపడ్డ భక్తుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.


ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత స్వామి ప్రోభుపాద్ శిల్పాన్ని కూడా దుండగులు దగ్ధం చేశారు. హిందువులందరి భద్రతకు భరోసా ఇవ్వాలని , నేరస్థులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. 






మతపరమైన హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హామీ ఇచ్చారు. అయినప్పటికీ హింస ఆగలేదు. గురువారం, హబీగంజ్ జిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద జరిగిన మత ఘర్షణలో ఒక పోలీసు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. 






భారత్‌ జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ సిబ్బంది వేడుకోలు


ఈ విషయంపై బంగ్లాదేశ్ తో వెంటనే మాట్లాడాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమ్ దాస్. 'బంగ్లాదేశీ హిందువులను కాపాడండి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసిన దాస్, పొరుగు దేశంలో హిందువులపై విస్తృత హింస జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


నోఖలిలోని ఇస్కాన్ ఆలయం వెలుపల 500 మంది గుమిగూడి, విగ్రహాలను ధ్వంసం చేసి, దేవాలయానికి నిప్పు పెట్టారని దాస్ పేర్కొన్నారు.


గురువారం బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై తన ప్రతిస్పందన తెలియజేసింది భారత్‌ రాయబార కార్యాలయం. ఢాకాలోని హైకమిషన్‌కు   బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడుతోందని ఈ విషయంపై చర్చిస్తోందనిపేర్కొంది.




మతపరమైన స్థలాలపై దాడుల నివేదికలను మేము చూశాము. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్‌ అయింది. ప్రభుత్వం సెక్యూరిటీ, పోలీసు భద్రత పెంచింది. వేడుకలు ప్రశాంతంగా జరుగుతాయన్ని అనుకున్నాం. జరిగిన సంఘటనల విచారణ బంగ్లాదేశ్‌కు వదిలేశాం.- MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి
 


బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస


బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకల సందర్భంగా హింస చెలరేగింది. ననువర్ దిగినది ఒడ్డున జరిగిన వేడుకల్లో ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న పుకారు సోషల్ మీడియాలో వ్యాపించింది. ఇదే ప్రస్తుత మత ఘర్షణలకు కారణమైంది. కుమిలియా జిల్లాలోని ననువా దిగిర్‌పార్ ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కనీసం 50 మంది గాయపడ్డారు.


ఖుల్నా జిల్లాలోని ఒక హిందూ దేవాలయం గేటు నుంచి కనీసం 18 బాంబులు స్వాధీనం చేసుకున్నారు, ఇది దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళన కలిగిస్తోంది.
అన్ని హింసాత్మక సంఘటనలపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. అదనంగా, భద్రతను పెంచడానికి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)దళాలను కనీసం 22 జిల్లాలలో మోహరించారు.


ASLO READ:  ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Published at: 16 Oct 2021 09:28 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.