బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగించింది.
దుర్గా మండపాలపై దాడి..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 100 కిమీ దూరంలో ఉన్న కుమిల్లా ప్రాంతంలోని హిందూ దేవాలయాలపై కొంతమంది ఛాందసవాదులు చేసిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులు చేసిన కాల్పుల్లో నలుగురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు.
దుర్గాపూజ మండపాల్లో దైవ దూషణతో మొదలైన ఉద్రిక్తత మందిరాలపై దాడికి దారి తీసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో గొడవలు మరిన్ని ఎక్కువయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం 22 జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించింది.
ఖండించిన భారత్..
బంగ్లాదేశ్‌లో జరిగిన మత విద్వేష ఘటనలను భారత్ ఖండించింది. ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలని బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Also Read: Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!
Also Read: Aryan Khan: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!