అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. అయితే ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్లడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల క్లింటన్ అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు వెల్లడించారు.
ఏం జరిగింది?
ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్.. స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో చేర్పించారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెకన్ కారణంగానే బిల్ క్లింటన్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. కానీ ఆయనను ఐసీయూలో ఉంచి ఐవీ యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు.
బిల్ క్లింటన్‌కు 2004లో బైపాస్ సర్జరీ జరిగింది. 2010లో రెండు స్టంట్లు కూడా వేశారు. కానీ ఆయనకు ఎలాంటి గుండె సమస్య కానీ, కొవిడ్ ఇన్‌ఫెక్షన్ కానీ లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. 1993 నుంచి 2001 మధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింటన్ సేవలందించారు.
ప్రజానేత..
- బిల్ క్లింటన్ 1993 నుంచి 2001 వరకు అమెరికా 42వ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 2001లో పదవి దిగిపోయినప్పటి నుంచి బిల్ క్లింటన్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
- ఛాతీ నొప్పి, శ్వాస సంబంధ సమస్యల కారణంగా 2004లో క్లింటన్‌కు బైపాస్ సర్జరీ చేశారు.
- 2010లో ఆయన గుండెలో రెండు స్టంట్లు వేశారు.
- అనంతరం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు.
- ముఖ్యంగా ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ తరపున పలుమార్లు ప్రచార బాధ్యతలను బిల్ క్లింటన్ చేపట్టారు.
Also Read: Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
Also Read: అద్భుతమైన సౌండ్‌బార్ కావాలా? బ్రాండెడ్ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్