అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కాందహార్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా 53 మంది వరకు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. నగరంలోని ఓ మసీదులో బాంబు పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. షియా కమ్యూనిటీకి చెందిన మసీదులో ఈ పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు.
శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరింది. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ దాడులకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
జంట పేలుళ్లు..
కాబుల్ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 108 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా.. 95 మంది అఫ్గాన్ వాసులు. 150 మంది గాయపడ్డారు. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకుంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.
అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కప్పటి హింసాకాండకు, నియంత చర్యలకు పాల్పడమని చెప్పినప్పటికీ మహిళలపై అరాచకాలు అలానే కొనసాగుతున్నాయి. మహిళలను విధుల్లోకి హాజరుకాకుండా తాలిబన్లు నియంత్రిస్తున్నారు. కో- ఎడ్యుకేషన్‌ను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అఫ్గాన్ మహిళల వస్త్రధారణపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
జర్నలిస్టులపై కూడా దాడులు పెరిగిపోయాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులను బహిరంగంగానే కాల్చిచంపారు. అయితే పైకి మాత్రం అంతా సవ్యంగా ఉందంటున్నారు. సరిహద్దు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబన్లు అంటున్నారు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
Also Read: Pay In Bitcoin: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్
Also Read: China on Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై చైనా ఉక్కుపాదం.. నియంతృత్వం పోతుందని భయమేమో!
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
Also Read: అద్భుతమైన సౌండ్‌బార్ కావాలా? బ్రాండెడ్ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్