బిట్‌కాయిన్.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. అయితే దీనిని ఓ రెస్టారెంట్ లో ప్రవేశపెట్టారు. అది ఎక్కడో కాదు.. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఆర్డర్ 2.1 అనే రూఫ్ టాప్ బార్, రెస్టారెంట్లో. గతవారం డిజిటల్ థాలీని.. వివిధ వంటలకు క్రిప్టో పేరుతో ప్రారంభించింది ఈ రెస్టారెంట్. ఇక్కడ కస్టమర్స్ బిట్ కాయిన్ లో చెల్లింపులు ఎంచుకోవచ్చు.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఆర్డర్ 2.1 రెస్టారెంట్ గ్లోబల్ డిష్ ప్లేట్‌లో వర్చువల్ కరెన్సీ చెల్లింపుపై 20 శాతం తగ్గింపు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇది డిజిటల్ చెల్లింపుల కాలమని.. వర్చువల్ కరెన్సీపై పెరుగుతున్న వ్యామోహం కారణంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు యజమాని సువీత్ కల్రా చెబుతున్నారు. Bitcoin, Dash, Dogecoin, Lightcoin, Etherium లలో వర్చువల్ కరెన్సీని చెల్లించవచ్చు.
'మేము క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపుపై 20 శాతం తగ్గింపును ఇస్తున్నాం. అయితే వినియోగదారులు ఎలాంటి తగ్గింపు లేకుండా నగదు, కార్డు లేదా పేటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు. క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి.. మేం కూడా దానిని వినియోగదారులు చెల్లించేలా ప్రయోగత్మకంగా చేపట్టాం. ఇది ఎలా పని చేస్తుందో చూడాలి.' అని రెస్టారెంట్ యాజమని చెప్పారు.
వర్చువల్ కరెన్సీ ప్రింటెడ్ కరెన్సీ కాదు, ఇది టోకెన్. ఎలక్ట్రానిక్ రికార్డులు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ వెనక సెంట్రల్ బ్యాంక్ లేదు, ఇది కరెన్సీగా విలువ ఇవ్వబడదు. బెలారస్, ఎస్టోనియా క్రిప్టోకరెన్సీ చెల్లుబాటు అవుతుంది అని సైబర్ న్యాయవాది పవన్ దుగ్గల్ చెబుతున్నారు.
క్రిప్టో కరెన్సీ అంటే..
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటాయి.పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. ప్రస్తుతం బిట్‌కాయిన్, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్‌కాయిన్ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు.. మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం. బ్లాక్‌చైన్ అనేది డేటా బైస్ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది.. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఒక సర్వర్‌కు మరో సర్వర్ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా దొంగిలించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు.
Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?