దేశవ్యాప్తంగా ప్రజలంతా దసరా నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి కోవింద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరా సూచిస్తుందని పేర్కొన్నారు. నైతికత, సన్మార్గంలో నడిపేందుకు దసరా పండుగ ప్రజలందరికీ స్ఫూర్తి ఇస్తుందని తెలిపారు. ఈ పండుగ దేశ ప్రజల జీవితాలలో శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు. 






ఉపరాష్ట్రపతి వెంకయ్య దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యవాక్ పరిపాలకుడైన శ్రీ రామచంద్రుని ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన జీవితాన్ని, ఆ పురుషోత్తముని జీవితం నుంచి మనకు లభించే మార్గదర్శనాన్ని దసరా పండుగ మనకు తెలియజేస్తుంది.’ అని ట్వీట్ చేశారు. 






దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 






విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక ద‌స‌రా అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు, విజ‌యాలు క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 






తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి దసరా ఓ ప్రత్యేక వేడుకని అన్నారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అని వివరించారు. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి అని పేర్కొన్నారు. 






కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా దసరా వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బ్రహ్మణవాడిలో దుర్గమ్మను సందర్శించారు. 






Also Read: మంత్రి హరీష్ బోటు షికారు.. బతుకమ్మ ఆడిన ఎర్రబెల్లి దయాకర్‌రావు..


Also Read: ఆయుధ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి