దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఫరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రేపటి (అక్టోబర్ 16) నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. అక్టోబర్ 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెల్లడించింది. ఫలితాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.inను సంప్రదించవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఈ నెల 3న నిర్వహించారు. ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లో మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. 


ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.. 
1. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in ను ఓపెన్ చేయండి. 
2. హోం పేజీలో JEE Advanced 2021 Result link ఉంటుంది. దీనిని ఎంచుకుంటే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
3. ఇక్కడ అభ్యర్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 రోల్ నంబర్, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అందించాలి. 
4. తర్వాత Check Result మీద క్లిక్ చేస్తే.. మీ ఫలితాలు కనిపిస్తాయి. 
5. భవిష్యత్ అవసరాల కోసం ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోండి. 


జైపూర్‌కు చెందిన మ్రిదుల్ అగర్వాల్ అనే విద్యార్థికి జేఈఈ పరీక్షలో మొదటి ర్యాంకు దక్కినట్లు తెలుస్తోంది. మ్రిదుల్‌కు 360 మార్కులకు గానూ 348 (96.66 శాతం) మార్కులు వచ్చాయని ALLEN కెరీర్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. జేఈఈ టాపర్ల వివరాలు తెలియాల్సి ఉంది. 






Also Read: డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.50,000 సాయం.. ప్రగతి ప్రోగ్రామ్ వివరాలివే..


Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి