పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా ప్రకటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే 'భీమ్లానాయక్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా.. అది యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ ను విడుదల చేశారు. 'సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు' అంటూ సాగే ఈ జానపద గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 


Also Read: పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..


మొన్నామధ్య ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 'అంత ఇష్టం' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. చెప్పినట్లుగానే ఈ సినిమాలో సెకండ్ సాంగ్  దసరా కానుకగా విడుదల చేశారు. 'అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీన' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ చిత్ర ఆలపించారు.  


మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బిజూమీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల చేయబోతున్నారు.