చెంబులో చెయ్యి ఎందుకు పెట్టావ్ అని సినిమా డైలాగ్ మీరు వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ చిరుత పిల్ల చెయ్యి కాదు ఏకంగా తలపెట్టింది. పని మీద అటుగా వెళ్తున్న వైఎస్సార్టీపీ నేత పిల్లి చెంబులో తల పెట్టిందనుకుని దాన్ని వెంబడించి రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో అది పిల్లి కాదు పులి అని తెలుసుకుని దాన్ని విసిరేసి కాళ్లకు పనిచెప్పారు. పులి పిల్ల అక్కడ నుంచి పరుగులు తీసింది. 


Watch: ఖమ్మం జిల్లాలో సోనూసూద్‌కు గుడి కట్టిస్తున్నారు..






పిల్లి కాదు పులిపిల్ల


రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూశారు. తన వాహనాన్ని ఆపి దాని వద్దకు వెళ్లారు. తల చెంబులో ఇరుక్కుపోయి పిల్లి ఇబ్బంది పడుతోందని భావించిన కొండా రాఘవరెడ్డి.. దానికి సాయం చేద్దామనుకున్నారు. పిల్లికి సాయం చెద్దామని దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అప్పటికి గానీ అసలు విషయం తెలియలేదు. ఒక్కసారిగా చిరుతపులి పిల్ల కరవడంతో అవాక్కయ్యారు. అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై కిందకు వదిలేశారు. ఆ పులి పిల్ల రాఘవరెడ్డి చేతిలో నుంచి దూకి పారిపోయింది.


Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ


చిరుతపులి సంచారం


కొండా రాఘవరెడ్డి తన అనుచరులు అది పులి పిల్ల అని తెలియగానే అక్కణ్నుంచి పరుగులు పెట్టారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులిపిల్ల గీరడంతో కొండా రాఘవరెడ్డి స్థానిక ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజిక్షన్ తీసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని రాఘవరెడ్డి అన్నారు. చిరుతతో పాటు దాని పిల్లలను కూడా పట్టుకోవాలని అధికారులను ఆయన కోరారు.


Also Read: బుధవారమా..? గురువారమా ? సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి