మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణాన్ని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. గురువారం సాయంత్రం నుంచి ఆర్కే మరణవార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన చేసింది. నిన్న ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆర్కే కన్నుమూసినట్లు తెలిపారు. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆర్కే చనిపోయారని స్పష్టం చేశారు. సాకేత్, మధు, శ్రీనివాస్, ఆర్కే అమరులయ్యారంటూ ప్రకటన విడుదల చేశారు.


కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీ సమస్య మొదలైంది. డయాలసిస్ ట్రీట్మెంట్ అందిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించాం. ఆర్కే మరణం పార్టీకి తీరని లోటు అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Also Read: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం


గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో 1958లో హరగోపాల్ జన్మించారు. ఆయన తండ్రి స్కూల్‌ టీచర్. హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తండ్రితో కలసి కొంతకాలం టీచర్ గా పని చేసేవారు. 1978లో విప్లవ రాజకీయాలపట్ల ఆకర్షితులై భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్లు నాయకత్వం వహించారు. 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక.. 2001లో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా మారారు.


Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన


2004లో ఏపీ ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్యల్లో మావోయిస్టుల టీమ్ కు నాయకత్వం వహించారు. కానీ చర్చలు విఫలం కావడంతో ఆయనను నిర్భందించి హత్య చేయాలని ప్రారంభించడంతో, ఆయనను ఏఓబీ ఏరియాకు కేంద్ర కమిటీ బదిలీ చేసింది. 2014 వరకు ఏవోబీ కార్యదర్శిగా ఆ తరువాత కేంద్ర కమిటీ నుంచి గైడ్ చేసే బాధ్యతను నిర్వహిస్తున్నారు. 2018లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోగా నియమించింది. ఏఓబీలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధ కాండలో పార్టీని, కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్కే అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యాడని కేంద్ర కమిటీ వెల్లడించింది.




Also Read: పండుగ నాడు భారీగా పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి