మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి 'విశ్వంభర' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. 


Also Read: ఫ్యాన్స్ కు పవన్ ట్రీట్.. సెకండ్ సాంగ్ వచ్చేసిందోచ్..


చాలా రోజులుగా రామ్ చరణ్.. 'జెర్సీ' ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ 16వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు. ఈ విషయాన్ని దసరా కానుకగా తెలియజేశారు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. ఈ కాంబినేషన్ కోసం తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 


మరోపక్క గౌతమ్ కూడా చరణ్ తో కలిసి పనిచేయడం విషయంలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'జెర్సీ' సినిమా విడుదలైన సమయంలో గౌతమ్ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్, ఉపాసన ఓ లెటర్ కూడా విడుదల చేశారు. తాజాగా ఆ లెటర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన చేసిన గౌతమ్.. చాలాకాలం నుంచి ఈ లెటర్ ని దాచిపెట్టానని.. చరణ్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నాను అంటూ రాసుకొచ్చారు. కానీ ఇంత త్వరగా ఈ అవకాశం వస్తుందని అనుకోలేదని.. ఐలవ్యూ చరణ్ సర్ అంటూ ట్వీట్ చేశారు.