బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు సర్ డేవిడ్ అమీస్‌ను హత్య చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది ఉగ్రవాద చర్యేనని లండన్ పోలీసులు ప్రకటించారు. ఈ హత్యకు పాల్పడిన పాతికేళ్ల యువకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ యువకుడి ఇంటితో పాటు మరో చోట సోదాలు చేసి కీలకమైన సమచారాన్ని సేకరించారు. ఉగ్రవాద కోణంలోనే హత్య జరిగిందని బ్రిటన్ పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు రావడంతో ఎంపీలదంరికీ భద్రత పెంచారు. ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ హత్యకు తాము కారణం అని ప్రకటించుకోలేదు. అలాగే ఎంపీ హత్యలో ఒక్కరే పాల్గొన్నారు. అతను కూడా ఫలానా ఉగ్రవాద గ్రూపునకు చెందిన వ్యక్తి అని పోలీసులు నిర్ధారించలేదు. ఎంపీ హత్య వెనుక భారీ కుట్ర ఉందని లండన్ పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు
సర్ డేవిడ్ అమీస్ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. నేరుగా ప్రజల్ని కలుస్తూ ఉంటారు. హత్య జరిగిన సమయంలోనూ ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. సమస్యలపై చర్చించేందుకు ఓచర్చిలో ఆయన సమావేశం పెట్టారు. దీనికి హాజరైన యువకుడు హఠాత్తుగా విరుచుకుపడ్డాడు. కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో డేవిడ్ అమీస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
Also Read : 'దుర్గా మండపాలపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టం'
నిందితుడ్ని సోమాలియా మూలాలున్న బ్రిటన్ పౌరుడిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద కుట్ర ఉందని తేలడంతో బ్రిటన్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం గ్రూప్ పని ప్రారంభించింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతోనే ఈ ఘటన చోటు చేసుకుందేనేదనికి ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీలందరికీ భద్రత పెంచారు. గత ఐదేళ్ల కాలంలో బ్రిటన్‌లో ఎంపీ హత్యకు గురవడం రెండో సారి. 2016లో కూడా ఓ ఎంపీని హత్య చేశారు.
Also Read: Aryan Khan: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!
సర్ డేవిడ్ అమీస్ .. అంతర్జాతీయ సమస్యలపైనా చురుకుగా స్పందించారు. ముఖ్యంగా జంతు సమస్యలు, అబార్షన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తారు. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల భావాజాలాలకు వ్యతిరేకం. అందుకే ఆయన సంస్థల సానుభూతి పరులు ఆయనను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. బ్రిటన్ ఎంపీ హత్యతో ప్రపంచం మొత్తం నివ్వెపోయింది. ఈ ఘటనను ఖండించింది. ఎంపీ కుటుంబానికి సంతాపం తెలిపింది.
Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!