మాతృత్వం ఒక వరం. పెళ్లి అయిన వెంటనే ప్రతి స్త్రీ కలలు కనే స్థానం అమ్మతనం. అమ్మతనాన్ని అందంగా, సమర్థవంతంగా అనుభూతి చెంది, పండంటి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మినివ్వాలంటే ముందుగా మీరు సిద్ధం కావాలి అంటున్నారు ఆరోగ్యనిపుణులు. మానసికంగా మీరు సిద్ధంగా ఉండడమేకాదు, శరీరాన్ని కూడా శక్తివంతంగా సిద్ధం చేయాలి. అందుకు ముందుగానే మీరు కొన్ని రకాల ఆహారపదార్థాలను తినడం మొదలుపెట్టాలి.
1. గర్భధారణకు ప్లానింగ్ లో ఉన్నప్పుడే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మెనూలో శక్తినిచ్చే ఆహారానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి.
2. రోజూ ఉదయం లేవగానే జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జురం, కిస్ మిస్, వాల్ నట్స్ వంటి నట్స్ అన్నీ కలిపి ఓ గుప్పెడు తినాలి. ఇవి గర్భం ఏర్పడ్డాక అది నిలిచేందుకు చాలా సాయపడతాయి. అలాగే అండం ఆరోగ్యకరంగా తయారయ్యేలా చేస్తాయి.
3. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాలి. సాల్మన్ చేప, అవిసెగింజలు, ఆలివ్ ఆయిల్ మొదలైన వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా దొరుకుతాయి. ఇది శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ లక్షణాలను కూడా తగ్గించి గర్భశయం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
4. నీటిని అధికంగా తీసుకోవాలి. రోజుకు మూడులీటర్లకు తగ్గకుండా తాగాలి. అలాగే ఇంట్లోనే తయారుచేసుకున్న పండ్ల జ్యూసులు తాగాలి.
5. వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. వారానికి కనీసం అయిదురోజులైనా రోజుకో గంటపాటూ వ్యాయామాలు చేయాలి. నడక, యోగా, ధ్యానం అలవర్చుకోవాలి.
6. ఓట్స్ తో చేసిన అల్పాహారాలను తరచూ తీసుకోవాలి. క్వినోవా, బ్రౌన్ రైస్ తో చేసిన వంటలు తినాలి. దీనివల్ల హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.
7. మీరు కూడా మానసికంగా సిద్ధమవ్వాలి. ముఖ్యంగా మనసును సంతోషంతో, పాజిటివ్ ఆలోచనలతో ఉంచాలి. తల్లి ఆరోగ్యమే బిడ్డపై ప్రభావం చూపిస్తుందన్న విషయం మర్చిపోవద్దు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్
Also read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి