చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్ ధోనీపై వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అతడు ఒకపని చేస్తూనే మరో లక్ష్యంపై గురిపెట్టగలడని పేర్కొన్నారు. ఒకపక్క ఐపీఎల్‌ బిజీలో ఉన్నా నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ సమీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. అతడి నుంచి గొప్ప నాయకత్వ పాఠాలు నేర్చుకోవచ్చని స్పష్టం చేశారు.


Also Read: 17 ఏళ్ల తర్వాత పాక్ లో టీం ఇండియా పర్యటన... ఆసియా కప్ 2023 హోస్టింగ్ హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్..!


కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (NCC)లో సంస్కరణలు తీసుకురావాలని నడుం బిగించింది. ఇందుకోసం నిపుణులు,  ప్రముఖులతో ఓ కమిటీని రూపొందించింది. మారిన కాలానికి అనుగుణంగా ఎన్‌సీసీని మార్చేందుకు ఏం చేయాలో చర్చించాలని కోరింది. అవసరమైన సలహాలను సూచించాలని వెల్లడించింది. ఇందులో ఆనంద్‌ మహీంద్రా, ఎంఎస్ ధోనీతో పాటు మరికొందరిని సభ్యులుగా చేర్చింది. రెండు రోజుల క్రితమే ఏర్పాటు చేసిన సమావేశానికి ధోనీ హాజరై విలువైన సలహాలు ఇచ్చాడని మహీంద్రా తెలిపారు.


Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా


'ఐపీఎల్‌ ఫైనల్‌కు రెండు రోజుల ముందే ఎంఎస్‌ ధోనీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ సమీక్షకు హాజరయయారు. అతడు సమావేశానికి బాగా సన్నద్ధమయ్యాడు. సూక్ష్మ మార్పులనూ సూచించాడు. చక్కని సూచనలు చేశాడు. ఐపీఎల్‌ ఒత్తిడిలోనూ హాజరైనందుకు అతడికి నేను ధన్యవాదాలు చెబితే.. తేలిగ్గా తీసుకున్నాడు' అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


ధోనీని చూసి ఓ పాఠం నేర్చుకోవచ్చని మహీంద్రా అన్నారు. 'జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడం దీన్నుంచి నేర్చుకోవచ్చు. మనదైన ముద్ర వేయడానికి జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. కేవలం ఒకే లక్ష్యానికే అంకితమవ్వకుండా మిగతావాటిపైనా ఫోకస్‌ చేయొచ్చు. కాస్త విరుద్ధంగా అనిపించినా ఇది నిజమే. స్పష్టంగా ఆలోచిస్తే, కచ్చితత్వంతో ఉంటే ఒకేసారి కొన్ని లక్ష్యాలపై పనిచేయొచ్చు' అని మహీంద్రా మరో ట్వీట్‌ పెట్టారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి