తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. సీఎం కేసీఆర్ కోసం ఆ పార్టీ నేతలు వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఒక్కరి పేరుపై 20 సెట్లకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీగా మరొకరు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంస్థాగత ఎన్నికల్లో తాను అధ్యక్షుని పోటీ పడతానని ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. వివిధ అంశాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నిక విషయం గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read : గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్


ప్రతి రాజకీయ పార్టీ విధిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ కమిటీల ఎన్నికలను నిర్వహించాలి. ఆ సమాచారాన్ని విధిగా ఎన్నికల సంఘానికి పంపాలి. అందుకే ప్రతి రెండేళ్లకోసారి వివిధ రాజకీయ పార్టీలు ప్లీనరీలు నిర్వహిస్తూ ఉంటాయి.  ఈ ప్లీనరీ కంటే ముందే పార్టీ సభ్యత్వాలను గ్రామ, మండల, పట్టణ కమిటీలను ఎన్నుకుంటారు. పూర్తి స్థాయిలో అన్ని రకాల కమిటీలు పూర్తయిన తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే తిరుగులేని స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే. అయినా సరే విధిగా ఎన్నిక ప్రక్రియ ఉండాలి. ఏకగ్రీవం అయినా సరే ప్రక్రియ జరగాలి. అందుకే టీఆర్ఎస్‌లో అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. 


Also Read: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. లిస్టులో ఉన్న 14 మంది వీళ్లేనా?


తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా తమ ప్లీనరీలు నిర్వహించే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసి సమాచారాన్ని ఈసీకి అందిస్తాయి. అయితే ఇటీవలి కాలంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. నిర్వహించేందుకు కూడా ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు. అయినప్పటికీ రఘురామకృష్ణరాజు తాను పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. గత ఏడాదే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించలేదని.. ఈ సారి నిర్వహిస్తారేమో చూడాలన్నారు. ఈ ఏడాది కూడా అయిపోయింది కాబట్టి వచ్చే ఏడాది నిర్వహిస్తే పోటీ చేస్తానన్నారు. 


Also Read : జగన్ ఎన్డీఏలో చేరితే ఏపీ మరింత అభివృద్ధి... 3 రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిది... కేంద్రమంత్రి అథవాలే షాకింగ్ కామెంట్స్


తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని నిరూపించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘురామ చెబుతున్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదన్నారు. స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని లేఖలో కోరారు.


Also Read: సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం... రూ.కోటి నిధి ఏర్పాటు చేస్తామని పవన్ ట్వీట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి