మెగాస్టార్ చిరంజీవి స్టాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ఇప్పటివరకు ఎంతో మందికి సాయం చేసింది. ఇప్పుడు ఆ ట్రస్ట్ సేవలను మరింత విస్తరించేందుకు మెగా ఫ్యామిలీ పూనుకుంది.  ఈ ట్రస్టు సేవలను ఆన్ లైన్ లోనూ అందుబాటులోకి తెచ్చారు. సోమవారం ఉదయం రామ్ చరణ్ ఆ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. అలాగే ఈ వెబ్ సైట్ కేవలం ఆంగ్లంలోనే కాదు 25 భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. అలాగే కె.చిరంజీవి పేరుతో మరో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు రామ్ చరణ్. ఇందులో చిరంజీవి జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఉంచినట్టు తెలిపారు చెర్రీ. చిన్నప్పట్నించి పడిన కష్టాలు, సినిమా రంగంలో నిలదొక్కకున్న క్రమం, మెగాస్టార్ గా ఎదిగిన వైనం, ఆయన సినిమా పాటలు, సినిమా ఇండస్ట్రీలలోని వారితో అతనికున్న అనుబంధాలు, సత్సంబంధాలు... ఇలా ఎన్నో వివరాలు ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారని వివరించారు. 


చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సీసీటీ)ని మెగా స్టార్ చిరు, తన బావ అల్లు అరవింద్ గైడెన్స్ లో 1998లో స్థాపించారు. ఆ ట్రస్టులో  రెండు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. అవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్. ఇప్పటివరకు ఎంతో మంది పేదలకు రక్తాన్ని ఉచితంగా అందించింది ఈ ట్రస్టు. కార్పోరేట్ ఆసుపత్రులకు మాత్రం తక్కువ రుసుము వసూలు చేసి అందించింది. ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 780 మంది కంటి ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు సేవలు విస్తరిస్తుండడం వల్ల మరింత మందికి ఈ ట్రస్ట్ సేవలు అందే అవకాశం ఉన్నాయి. 








Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు


Also read: ఆ పండుగకి వచ్చేస్తున్న శ్యామ్ సింగరాయ్


Also read: ఈ అయిదు తినండి చాలు... చర్మం మెరిసిపోవడం ఖాయం


Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి


Also read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి