‘మా’ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంచు విష్ణు. తండ్రి మోహన్ బాబు సహా 'మా' లోని తన ప్యానల్ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  అందరి కృషి వల్లే తాము గెలిచామన్నారు మంచు విష్ణు.  తన ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే తాను అధ్యక్షుడైనట్లు చెప్పాడు. ఇక నుంచి తన ప్యానల్ సభ్యులకు అద్భుతమైన పనులు చేయడానికి బలం ప్రసాదించమని  శ్రీవారి కోరుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు.  



ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ రాజీనామాలపై స్పందిస్తూ.. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చారు విష్ణు. తిరుమలలో ఎవరి గురించి కాంట్రవర్సరీలు మాట్లాడనని చెప్పారు. ' మా' ప్రెసిడెంట్ అంటే మాములు విషయం కాదని.. చాలా చాలా బాధ్యతతో కూడుకున్నదని మోహన్ బాబు అన్నారు. మా సభ్యులందరి ఆశీర్వాదంతో విష్ణు అధ్యక్షుడు కాగలిగాడని అన్నారు. ఇక విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను  అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడన్నారు మోహన్ బాబు.
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
మంచు విష్ణు కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా ముందు అంత రచ్చ చేసిన  ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఇప్పటి వరకూ రాజీనామా చేయలేదా అనే చర్చ జరుగుతోంది. దీనిపై ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ సభ్యులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.  
Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్
ఇక 'మా'  ఎన్నికల  తర్వాత రకరకాల ట్విస్టులిస్తున్నారు.  ముఖ్యంగా మోహన్ బాబు వర్గం రౌడీయిజానికి పాల్పడ్డారని దురుసుగా ప్రవర్తించారని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపించింది. విష్ణు- మనోజ్ హుందాగా వ్యవహరించినా పెద్దాయన వ్యవహారంపై సినిమా బిడ్డలం ప్యానెల్ గుర్రుమీదుంది. ఇకపోతే ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ ని తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ వర్గం కోరగా.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ అందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కోర్టుల పరిధిలో అంశం. కోర్టు ద్వారా మాత్రమే ఇవ్వగలం అని జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పంచాయితీని బదలాయించారు. సీసీ ఫుటేజ్ ఉన్న గదికి తాళం వేసి ప్రస్తుతం అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లేందుకు ప్రకాష్ రాజ్ వర్గం ప్రయత్నిస్తోందని కథనాలొస్తున్నాయి. తాజా పరిణామాలతో సీసీ ఫుటేజ్ లో ఏం ఉంది? అన్న క్యూరియాసిటీ మొదలైంది. మొత్తానికి 'మా' ఎన్నికలు ముగిసినా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడో చూడాలి.
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
Also Read: ప్రోమోలో బాలకృష్ణ గుర్రపు స్వారి?.. ఈ పిక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి