బిగ్ బాస్ - 5 తెలుగు‌లో ఆదివారం ప్రసారమైన 43వ ఎపిసోడ్‌లో.. లోబో ఎలిమినేట్ అయినందుకు.. హౌస్‌మేట్ బాధ పడుతున్నట్లుగా కనిపించారు. ఎవరి పెర్ఫార్మెన్స్ వారు చూపించారు. లోబో తండ్రి చనిపోయినప్పుడు నేను ఒక్కడినే అతడి దగ్గర ఉన్నానని రవి.. విశ్వతో అన్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆయన ఒక్కసారే కుప్పకూలి చనిపోయాడని, ఆ విషయం తెలిసి నాగోల్ నుంచి తాను, లోబో పరిగెట్టుకుని వచ్చామని రవి పేర్కొన్నాడు. ఆనీ మాస్టర్, సన్నీ, ప్రియాంక తదితరులు కూడా లోబో ఎలిమినేషన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. 


సండే-ఫండే కావడంతో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల్లో ఫన్ నింపే ప్రయత్నం చేశారు. పీపీపీ.. అంటూ బూరలను ఉదతూ పాటలను గెస్ చేయాలని చెప్పాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించారు. టీమ్-ఎలో సిరి, షన్ను, కాజల్, శ్రీరామ, ప్రియాంక, విశ్వ, మిగతా సభ్యులను టీమ్-బిగా ఎంపిక చేశారు. ఈ గేమ్‌కు రవిని సంచాలకుడిగా నియమించారు. ఈ ఆటలో కాజల్ ఎక్కువ పాటలను గెస్ చేయడంతో టీమ్-ఎ గెలిచింది. 


అనంతరం హుండీలను పగలగొట్టడం ద్వారా ఎవరు సేఫ్ ఉన్నారో చెప్పారు. ఈ రౌండ్‌లో బొమ్మల ద్వారా ప్రియాంక, షన్నులు సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత సన్నీ, శ్రీరామ్ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. మిగతా ఐదుగురు నామినేషన్‌లో ఉండగా.. మరో గేమ్ మొదలుపెట్టారు. అనంతరం కళ్లకు గంతలతో రో గేమ్ ఆడించారు. ఈ గేమ్ ప్రకారం.. ఒకరు దారి చెబితే మరొకరు హూలా హుప్స్ మధ్యలో ఉన్న చెక్క ఎముకను పట్టుకోవాలి. అలా ఎవరు వేగంగా చేస్తారో వారు విజేతగా నిలిచినట్లు. ఈ గేమ్‌లో కూడా ఏ-టీమ్.. చురుగ్గా పాల్గొంది. షన్ను, సిరి, ప్రియాంక, జెస్సీలు బాగా ఆడటంతో టీమ్-ఎ విజేతగా నిలిచింది.  


ఈ గేమ్ మధ్యలో కుక్క బొమ్మను ఇచ్చి.. అది ఎవరి చేతిలో అరవకుండా సైలెంట్‌గా ఉంటుందో వారు సేఫ్ అని నాగ్ తెలిపారు. దీంతో విశ్వ, రవి ఇద్దరు సేఫ్ అయినట్లు నాగ్ తెలిపారు. అనంతరం సిరి, జెస్సీ, శ్వేతాల్లో.. జెస్సీ సేఫ్ అయినట్టు ప్రకటించారు. మిగిలిన ఇద్దరిని గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లి.. సుత్తితో అక్కడున్న డబ్బాను పగలగొట్టమన్నారు. అనంతరం ఆ డబ్బాలను లివింగ్ ఏరియాకు తీసుకొచ్చి తెరవాలని నాగ్ తెలిపారు. దీంతో కాసేపు హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఒక డబ్బాలో సిరి బొమ్మ ఉండటంతో ఆమె సేఫ్ అయినట్లు ప్రకటించారు. దీంతో శ్వేత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలని నాగ్ తెలిపారు. శ్వేత ఎలిమినేషన్‌తో ఆనీ మాస్టర్ బోరున ఏడ్చేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్‌తో ఎవరెవరు సేఫ్, ఎవరెవరు డేంజర్‌లో ఉన్నారో తెలిపింది. సోమవారం జరిగే నామినేషన్‌కు జంగిల్ థీమ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోతి, కత్తి, అరటిపండు గేమ్ ద్వారా నామినేషన్ జరగనుంది. 


Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్


Also Read: బిగ్ బాస్-5.. తల్లి సేఫ్.. కూతురు ఔట్.. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆమే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి