ప్రకృతి అందాలకు ప్రతీక అయిన విశాఖ మన్యంలో తుపాకులు గర్జించాయి. మన్యంలో తెగబడ్డ గంజాయి స్మగ్లర్లు ఏకంగా పోలీసులపై రాళ్లురువ్వారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు హద్దు మీరారు. ఏకంగా పోలీసులపైనే రాళ్ల దాడి చేశారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెంబడించి ఆ ప్రాంతానికి వచ్చిన నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. దాడి నుంచి తప్పించుకోడానికి నల్గొండ పోలీసులు ఓపెన్ ఫైర్ చేశారు. గాల్లోకి 10 రౌండ్ల వరకు కాల్పులు జరిగాయి. లంబసింగి ఘాట్ రోడ్డులో డౌనూరు వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలం నుంచి స్మగ్లర్లు తప్పించుకున్నారు. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Also Read: సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది... దిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి... నగరిలో యువకుడు గల్లంతు


20 మంది గంజాయి స్మగ్లర్లు


గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా 20 మంది గంజాయి స్మగ్లర్లు పోలీసులకు ఎదురయ్యారు. పోలీసుల గమనించిన స్మగ్లర్లు వారిపై రాళ్లదాడికి దిగారు. దీంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబు గాయపడ్డారు. గాయపడిన వారిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ


పోలీసులపై రాళ్ల దాడి


విశాఖ మన్యంలో స్మగ్లర్లు ఎదురుదాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులతో స్మగ్లర్లు పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. బాధితులు రాంబాబు, కామరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల కాలంలో గంజాయి రవాణా మరింత పెరిగిపోయింది. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నా స్మగ్లర్లు కొత్త దారుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేసినప్పటికీ స్మగ్లర్లు మాత్రం కొత్త మార్గాలను వెదుకుతున్నారు. 


Also Read: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు కూలీలు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి