ఇప్పటివరకు మనం ఎన్నో అంతరిక్ష సినిమాలను చూశాం. వాస్తవానికి అందులో సీన్లను బ్లూ మ్యాట్‌లో షూట్ చేసి.. గ్రాఫిక్స్‌తో మెరుగులు దిద్దుతారు. ఎందుకంటే.. అంతరిక్షంలోకి ప్రయాణించడమంటే మాటలు కాదు. ప్రత్యేకమైన ర్యాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలి. అక్కడి వాతావరణాన్ని తట్టుకోడానికి వీలుగా ప్రత్యేక శిక్షణ కూడా పొందాలి. నటీనటుల్లో కూడా చాలా ధైర్యం ఉండాలి. అయితే, రష్యాకు చెందిన ఓ సినీ నిర్మాణ సంస్థ మాత్రం ఖర్చులకు వెనకాడకుండా ఏకంగా అంతరిక్షంలో విజయవంతంగా షూటింగ్ నిర్వహించి భూమికి తిరిగి వచ్చింది.
రష్యాకి చెందిన 'ది ఛాలెంజ్' అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఐస్)కు బయలుదేరి వెళ్లారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్ వెళ్లారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సీన్‌ను చిత్రీకరించడానికి స్పేస్‌కు వెళ్లారు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుందట.
12 రోజుల పాటు వీరంతా స్పేస్ స్టేషన్‌లోనే ఉన్నారు. ఆ తరువాత వీరిని మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకువచ్చింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ నాలుగు నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. సినిమాను ఇలా అంతరిక్షంలో చిత్రీకరించడంపై రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించారు. కానీ వాటిని లెక్క చేయకుండా చిత్రబృందం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. షూటింగ్ అనుకున్నట్లుగా పూర్తయితే.. అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. త్వరలో టామ్ క్రూయిజ్ కూడా తన తదుపరి చిత్రం గురించి అంతరిక్షానికి వెళ్లనున్నారు. అంటే.. భవిష్యత్తులో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా