నల్గొండ జిల్లా డిండి జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. జలాశయం వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలాశయంలో పడిపోయి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన సాగర్, ప్రవీణ్​శ్రీశైలం దేవాలయం దర్శనానికి కలిసి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తూ దిండి జలాశయం వద్ద కాసేపు కాలక్షేపం చేద్దామనే ఉద్దేశంతో ఆగారు. అక్కడ దృశ్యాలను చరవాణీలో బంధించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ దిగుతుండగా కాలు జారి ఇద్దరు యువకులు జలాశయంలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


Also Read:  భర్త పెదాలను కోసేసిన భార్య ! ఇది వికటించిన సరసం కాదు.. ఎందుకంటే ?


నగరి కుశస్థలినది బుగ్గలో విద్యార్థి గల్లంతు


చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అనంతప నాయుడు కండ్రిగ సమీపంలోని బుగ్గానకట్ట నదిలో చెర్లోకండ్రిగ గ్రామానికి చెందిన సంతోష్ అనే ఇంటర్మీడియట్ విద్యార్ధి గల్లంతు అయ్యాడు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బుగ్గ ప్రవాహంలో శనివారం స్నేహితులతో కలిసి స్నానానికి దిగిన సంతోష్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గల్లంతైన సంతోష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. 




Also Read: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..


ప్రమాదం అంచున ఆటలు


నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్ద సందర్శకుల సందడి పెరిగింది. ఆదివారం కావటంతో ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన చిన్నారులు ఈతకు దిగుతున్నారు. అప్రాన్ దెబ్బతిని ఉండటంతో ఈతకు దిగిన వారు మునిగిపోయే ప్రమాదం ఉంది. కొద్ది రోజులుగా జలాశయానికి వరద వస్తుండటంతో  11,12 గేట్ల ద్వారా పెన్నాకు వరద నీటిని వదిలిపెట్టారు. ప్రాజెక్ట్ ముందు ఉన్న అప్రాన్ దెబ్బతిని ఉండడంతో నీళ్లు అందులోకి వస్తున్నాయి. అక్కడికి వచ్చిన సందర్శకులు ఈ నీటిలోకి దిగి ఈత కొడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో అజాగ్రత్తగా ఉంటున్నారు. అధికారులు పట్టించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Watch: ప్రమాదం అంచున విహారం... సోమశిలకు పెరిగిన సందర్శకుల సందడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి