Corona Cases In AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా పాజిటివ్ కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 31 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 432 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,57,577కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ ఐదుగురు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో 14,307 మంది ప్రాణాలు కోల్పోయారు. 






మెరుగ్గా రికవరీ రేటు..
ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 57 వేల 557 మంది కరోనా బారిన పడగా, అందులో 20,37,236 మంది కొవిడ్19 మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు క్రమేపీ మెరుగవుతోంది. నిన్న ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల కన్నా రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. శనివారం నాడు 586 మంది కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,034 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,89,54,134 (2 కోట్ల 89 లక్షల 85 వేల 846) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... నిన్న ఒక్కరోజులో 31,712 శాంపిల్స్‌ టెస్ట్ చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.


Also Read: రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి... సీమ కోసం దిల్లీలో పోరాటం... ఇక రంగంలోకి దిగుతానన్న ఎమ్మెల్యే బాలకృష్ణ 


ఈ జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావం..
నిన్న అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 మంది కరోనా బారిన పడ్డారు. గుంటూరులో 61, కృష్ణాలో 60, నెల్లూరులో 43, ప్రకాశంలో 41, విశాఖపట్నం జిల్లాలో 39 మందికి తాజాగా కరోనా సోకింది. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున కొవిడ్19 బారిన పడ్డారని ఏపీ వైద్య శాఖ పేర్కొంది. కోవిడ్19 బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మృతిచెందారు.


Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి