కర్నూలు జిల్లాలోని సంజీవయ్య గృహాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వి్ట్టర్లో ఒక పోస్టు పెట్టారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య నిత్యస్మరణీయులన్నారు. ఆయన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పేదరికంలో పుట్టిన సంజీవయ్య అసాధారణ వ్యక్తిగా ఎదిగారని పవన్ చెప్పారు. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నప్పటికీ సంజీవయ్య ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్ పేర్కొన్నారు. ఈ పోస్టులో దామోదరం సంజీవయ్య ఇంటి ఫొటోలను పవన్ జతచేశారు.
Also Read: సందడిగా ‘అలయ్ బలయ్’.. గవర్నర్ నృత్యాలు, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, పవన్ కల్యాణ్
అలయ్ బలయ్ స్ఫూర్తిదాయం
హైదరాబాద్ జలవిహార్ లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. 16 ఏళ్లుగా అలయ్-బలయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలని సూచించారు.
Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని
ఘనంగా అలయ్ బలయ్
హైదరాబాద్జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమం సందడిగా సాగింది. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.