‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జల విహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు కలుసుకున్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో పాటు పలువురు హాజరయ్యారు. అతిథులందరికీ దత్తాత్రేయ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి మహిళలతో డాన్సులు చేశారు.
Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దుర్గామాతకు, జమ్మిచెట్టుకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. అలయ్.. బలయ్.. కార్యక్రమంలో ఒకరినొకరు ఆలింగనాలతో సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా.. నమస్కారాలతో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది.
Also Read: Hyderabad: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
అలయ్ బలయ్‌కు ప్రముఖులంతా హాజరు అయిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని కోరుకునేవాడినని తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.