దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండగ సమయంలో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లినవాళ్లు తిరిగి వెళ్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. 


ఇవాళ, రేపు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..



  • సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక రైలు

  • విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రత్యేక రైలు

  • సికింద్రాబాద్‌-నిజామాబాద్‌ మధ్య ఉదయం 9.50 గంటలకు ప్రత్యేక రైలు

  • నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మధ్య మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక రైలు

  • కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలు

  • కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక రైలు


రైలు నంబరు 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల  20, 27 తేదీల్లో రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08580 ఈ నెల  21, 28 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 7.40కి బయలుదేరి ఉదయం 6.40కి విశాఖపట్నం చేరుతుంది.


రైలు నంబరు 08583 విశాఖపట్నం-తిరుపతి ఈ నెల 18, 25 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7.15కి బయలుదేరి ఉదయం 7.30కి తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నంబరు 08584 రైలు ఈ నెల 19, 26 తేదీల్లో తిరుపతిలో ఈ నెల రాత్రి 9.55కి బయలుదేరి ఉదయం 10.20కి విశాఖపట్నం చేరుతుంది.
రైలు నంబరు 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి ఉదయం 7.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08586 ఈ నెల 20,27 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.05కి బయలుదేరి ఉదయం 9.50కి విశాఖపట్నం చేరుతుంది.


06036 చెన్నై సెంట్రల్‌-సంత్రాగచి ప్రత్యేక రైలు ఈ నెల 19, 26 నవంబరు 2వ తేదీల్లో చెన్నై సెంట్రల్‌లో ఉదయం 8.10కి బయలుదేరి  తర్వాతి రోజు రాత్రి 10.25కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 06035 ఈ నెల  20, 27 నవంబరు 3వ తేదీల్లో సంత్రాగచిలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.30కి చెన్నై సెంట్రల్‌ చేరుతుంది.


Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు


Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!


Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి