తెలంగాణలో దసరా పండగను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. అయితే చుక్క, ముక్క కూడా తప్పనిసరి. దసరా పండగకు ఏటా.. కోట్లలో మద్యం అమ్ముడవుతుంది. ఈసారి కూడా లెక్కలు మాత్రం తగ్గలేదు. కోట్లలో మద్యం అమ్ముడుపోయింది. కేవలం దసరా పండగ ఒక్క ఒక్కరోజే తెలంగాణలో 200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేసినట్లు గణంకాలుు చెబుతున్నాయి. గతేడాది కంటే.. ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకం జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో లాక్‌డౌన్ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల విలువైన మద్యం విక్రయం జరిగింది. మళ్లీ దసరా పండగనాడు ఒక్క రోజే రూ. 200 కోట్ల విలువైన మద్యం సేల్ అయిందని ఎక్సైజ్ రికార్డులు చెబుతున్నాయి. దసరా పండగ సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 వ తేదీ వరకు ఐదు రోజు సమయంలో రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది.
ఇక అత్యధికంగా హైదరాబాద్ 190 కోట్లు, హనుమకొండలో155 కోట్లు, రంగారెడ్డి 194 కోట్లు, నల్లగొండలో 128 కోట్లు, మేడ్చల్‌లో 103 కోట్లు, కరీంనగర్‌లో 94 కోట్లు, ఖమ్మంలో 90 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 72 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 487 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెప్పారు. అంతే కాదు ఈ నెలాఖరు వరకు మరో 1600 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది.
అత్యధికంగా హైదరాబాద్ 190 కోట్లు, హనుమకొండలో155 కోట్లు, రంగారెడ్డి 194 కోట్లు, నల్లగొండలో 128 కోట్లు, మేడ్చల్‌లో 103 కోట్లు, కరీంనగర్‌లో 94 కోట్లు, ఖమ్మంలో 90 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 72 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 487 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెప్పారు.
గత ఏడాది అక్టోబర్ నెలలో మందు బాబులు రూ. 2,623 కోట్ల విలువైన మద్యం తాగేశారని.. అలాగే ఈసారి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం రూ.3000 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంచనా.
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు