శాసనమండలిలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. అందులో మూడు ఎమ్మెల్యే కోటాలో, మిగిలిన 11 స్థానిక సంస్థల కోటాలో ఉన్నాయి. కరోనా కారణంగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 


ఎన్నికలు జరిగితే ఈ 14 స్థానాలు దాదాపు వైసీపీ దక్కించుకోవచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలిలో వైసీపీ సభ్యులు 18 మంది ఉన్నారు.  14 వస్తే ఆ మొత్తం 32కు చేరుతుంది. అప్పుడు మండలిలో పూర్తి మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మండలి మొత్తం సభ్యుల సంఖ్య 58.


అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలపై చాలామందే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం. ఇంకా అధికారికంగా పేర్లు బయటకు చెప్పలేదు. ఎమ్మెల్యే కోటాలో గత మేలో పదవీకాలం పూర్తిచేసుకున్న డీసీ గోవిందరెడ్డిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన రెండు స్థానాలనూ ఎస్సీ, మహిళకు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. 


స్థానిక సంస్థల విభాగంలో కృష్టా, గుంటూరు, విశాఖపట్నంలో రెండు.. చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశంలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. విజయనగరం ఇందుకూరి రఘురాజు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, వంశీకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉదయభాస్కర్‌, ఆకుల వీర్రాజు, రామసుబ్రహ్మణ్యం, తోట వాణి. కృష్ణా జిల్లాలో రెండు స్థానాల్లో ఒకటి బీసీ మరొకటి ఓసీ అభ్యర్థికిచ్చే ఛాన్స్ ఉంది. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌. ప్రకాశం జిల్లాలో తూమాటి మాధవరావు, బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి భరత్‌.. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే నాయుడు, హరిప్రసాద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వై. విశ్వేశ్వరరెడ్డి పేరు వినిపిస్తోంది. లేదా ఎవరైనా మహిళా అభ్యర్థికి అవకాశం ఇస్తారా చూడాలి. 

 


Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..


Also Read: Selfie Death: సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది... దిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి... నగరిలో యువకుడు గల్లంతు


Also Read: Visakha Police Fire: విశాఖ మన్యంలో కాల్పుల కలకలం... పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి... తుపాకులకు పనిచెప్పిన నల్గొండ ఖాకీలు


Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద


Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి