భారత్  మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..రూ.47,070 ఉంది.  దివాలీ దగ్గర పడుతుండడంతో బంగారం ధర ఆఫ్ సెంచరీ కొట్టేస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ మేరకు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం అంటున్నారంతా. 
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,180, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,200
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,180, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,200
విశాఖ పట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,180, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,200
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,330,  10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,540
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070,  10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,070
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,630, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,690
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
వెండిధరలు: కొన్ని ప్రధాన నగరాల్లో స్వల్పంగా హచ్చు తగ్గులు మినహా భారత్ మార్కెట్లో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత్ మార్కెట్లో  కేజీ వెండి  రూ.63,600 ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి  ధర రూ. 67,400 ఉండగా... ఢిల్లీ, ముంబై, కోల్ కతా , బెంగళూరు, లక్నోలో కేజీ వెండి ధర రూ. 63,600 ఉంది. చెన్నై కేరళలో కేజీ వెండి రూ. 67,400 ఉంది.
Also Read: వాహనదారులకు షాక్! మరింత ఎగబాకిన ఇంధన ధరలు.. కారణం ఏంటంటే..
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి