ఒకే కాన్సులో కవలలు పుడితేనే చూసుకోవడం కష్టంగా భావిస్తారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ ఓ మహిళ తొమ్మిది మంది పిల్లలను ప్రసవించింది. ఈ ఏడాది మే నెలలో ఆమె ప్రసవం జరిగింది. తొమ్మిది మంది పిల్లలతో ఆమె ఎలా జీవనం సాగిస్తుందో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. హలీమా సిస్సే మాలిలో నివసిస్తోంది. ఆమెకు మొదట ఒక పాప జన్మించింది. రెండో సారి గర్భం దాల్చాక పొట్టలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. నెలలు గడుస్తున్న కొద్దీ పొట్ట మరింతగా పెరగడం ప్రారంభించింది. చివరికి ఏడుగులు శిశువులు పుట్టబోతున్నట్టు చెప్పారు వైద్యులు. ప్రసవం కోసం మాలి దేశం నుంచి మొరాకో దేశానికి వచ్చింది.
ఈ మే నెలలో మొరాకోలోని ఓ ఆసుపత్రిలో హలీమాకు సిజెరియన్ చేశారు వైద్యులు. పొట్ట నుంచి తీస్తున్న కొద్దీ పిల్లలు వస్తూనే ఉన్నారు. ఏడుగురనుకుంటే మొత్తం తొమ్మిది మంది పిల్లలు పుట్టారు. వారిలో అయిదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు. నెలలు నిండాకుండానే పుట్టడంతో వారందరినీ నెల రోజుల పాటూ ఇంక్యుబులేటర్లోనే ఉంచారు. ఆ తరువాత తల్లిదండ్రులకు అప్పజెప్పారు. పిల్లల ఆరోగ్య రీత్యా ఆసుపత్రి పక్కనే ఇల్లు తీసుకున్నారు హలీమా దంపతులు. ఆసుపత్రి సిబ్బంది తమకెంతో సాయం చేస్తున్నారని, పిల్లల పనులు చేసిపెడుతున్నారని చెబుతోంది హలీమా. తొమ్మిది మంది పిల్లలకు రోజుకు ఆరు లీటర్ల పాలు అవసరం అవుతాయని చెబుతోంది. రోజూ వంద డైపర్ల దాకా మారుస్తున్నట్టు తెలిపింది. ఆ ఖర్చు భరించడం కష్టంగానే ఉన్నట్టు చెబుతోంది. ఆసుపత్రి బిల్లే పదిన్నర కోట్ల రూపాయల దాకా అయింది. అయితే అందులో ఎక్కువ శాతం మాలి ప్రభుత్వమే భరించింది. పిల్లలు సాధారణ బరువుకు చేరుకుని, ఆరోగ్యంగా తయారయ్యాక తిరిగి తమ దేశమైన మాలికి వెళ్లిపోతామని చెబుతోంది హలీమా.
అక్కడ వీరికి కేవలం మూడు గదుల ఇల్లు మాత్రమే ఉంది. ఇప్పుడు తొమ్మిది మంది చిన్నపిల్లలతో కలిపి పన్నెండు మంది కుటుంబసభ్యులు ఆ ఇంట్లోనే జీవించాలని నిరాశగా చెబుతోంది హలీమా. పెద్ద ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని అంటోంది. పిల్లలు ఆహారం, చదువు, అవసరాలు తీర్చడానికి చాలా ఎక్కువ డబ్బు అవసరమని ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు చెబుతున్నారు హలీమా దంపతులు.
Also read: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి