ఒక్క ఓటమి.. 150 కోట్ల హృదయాలను బద్దలు చేసింది.
ఒక్క ఓటమి.. 14 సంవత్సరాల చరిత్రను చించి పారేసింది.
ఒక్క ఓటమి.. పక్కదేశం ముందు పరువు తీసేసింది.


పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిని దేశంలోని క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు. సాధారణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పది వికెట్లతో ఎదురైన ఈ దారుణ పరాభవం ఇంకొన్నాళ్లు భారత్‌ని వెంటాడుతూనే ఉంటుంది.


జట్టుగా చూసుకున్నా.. పాకిస్తాన్ కంటే భారత్ ఎంతో ముందంజలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రపంచంలోనే బెస్ట్ ఇచ్చే ప్లేయర్లు మన దగ్గర ఉన్నారు. మరి తప్పెక్కడ జరిగింది? ఆటగాళ్ల తప్పులతో పాటు సెంటిమెంట్ కూడా వెక్కిరించిందా? వెస్టిండీస్ తరహాలోనే దురదృష్టం మనల్ని చుట్టుముట్టిందా?


శనివారం వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 55కే ఆలౌట్ చేసి ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు కొన్ని పోలికలు ఉన్నాయి. ప్రత్యర్థి జట్ల కంటే ఓడిపోయిన జట్టులోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్, మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు.


అన్నిటికంటే కీలకమైనదే ‘6’ సెంటిమెంట్. ఇంగ్లండ్, వెస్టిండీస్ 2021 ప్రపంచకప్ మ్యాచ్ ముందువరకు టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్.. ఇంగ్లండ్‌పై ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఐదు మ్యాచ్‌లు ఆడితే ఐదు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీసే విజయం సాధించింది. కానీ ఈ సంవత్సరం జరిగిన ఆరో మ్యాచ్‌లో మాత్రం విండీస్ బొక్కబోర్లా పడింది. అత్యంత ఏకపక్షంగా ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది.


భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా అంతే.. ఈ మ్యాచ్ ముందువరకు పాకిస్తాన్‌పై భారత్ అస్సలు ఓడిపోలేదు. ఐదు మ్యాచ్‌లు ఆడితే ఐదింటిలోనూ విజయాలు సాధించింది. కానీ ఈ సంవత్సరం జరిగిన ఆరో మ్యాచ్‌లో విండీస్ తరహాలోనే ఏకపక్షంగా ఓడిపోయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాకిస్తాన్ 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది.


వీటి మధ్య ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది. ఈ రెండు ఓటములకూ ఒకే స్టేడియం వేదికైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఈ రెండు మ్యాచ్‌లూ జరిగాయి. ఎన్ని సెంటిమెంట్లు అనుకున్నప్పటికీ.. భారత జట్టు ఘోరవైఫల్యం మాత్రం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ తన చివరి టోర్నీలో అయినా.. విజయం సాధించి మొదటి ఐసీసీ టోర్నీ గెలవాలంటే.. భారత్ పుంజుకుని మిగతా మ్యాచ్‌లు కచ్చితంగా గెలిచి తీరాల్సిందే! ఈ ఓటమి చీకటి నీడల నుంచి బయటపడి విజయాల వెలుగుల వైపు అడుగులు వేయాల్సిందే!


Also Read: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!


Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!


Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి