టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68 నాటౌట్: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఆడటంతో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్.. భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు వెళ్లాలంటే దాదాపు అన్ని మ్యాచ్‌లూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు కీలక వికెట్లు తీసిన షహీన్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కింగ్ కోహ్లీ ఫాంలోకి..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ(0: 1 బంతి), మూడో ఓవర్లో ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌లను (3: 8 బంతుల్లో) అవుట్ చేసి షహీన్ అఫ్రిది పాకిస్తాన్‌కు మంచి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా అవుటవ్వడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (39: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. వికెట్లు పడిన ఒత్తిడి లేకుండా స్కోరింగ్ రేట్ పడకుండా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. దీంతో పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులను భారత్ సాధించింది.
హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పంత్ రెండు వరుస సిక్సర్లు రాబట్టాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో.. భారత్ మరోసారి కష్టాల్లో పడింది. జడేజా (13: 11 బంతుల్లో, ఒక ఫోర్), కోహ్లీ కాసేపు నిదానంగా ఆడారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 45 బంతుల్లో కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో జడేజా కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో విరాట్ కోహ్లీ అవుటయినా 17 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో.. కేవలం ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీయగా, హసన్ అలీ రెండు వికెట్లు, షాదబ్ ఖాన్, రవూఫ్ చెరో వికెట్ తీశారు.
ఒక్క వికెట్టూ తీయలేక..
ఇక పాకిస్తాన్ బ్యాటింగ్.. భారత్ బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా సాగింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68 నాటౌట్: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టీమిండియాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్క సాధికారిక అప్పీల్ కానీ, ఒక క్యాచ్ కానీ.. ఏ అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆడారు. పవర్ ప్లేలో నుంచే వీరు వేగంగా ఆడటం ప్రారంభించారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో మొదట ఇబ్బంది పడినా.. మెల్లగా వారి బౌలింగ్‌లో కూడా పరుగులు సాధించారు. పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 71 పరుగులకు చేరుకుంది.
పది ఓవర్ల తర్వాత వీరు గేర్ మార్చారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వీరు 16 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 121 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత కూడా వీరు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడటంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!
Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?