T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?
Continues below advertisement
టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి 14 సంవత్సరాలు దాటింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత జట్టు అదరగొట్టినా సెమీస్, ఫైనళ్లలో తడబడుతోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తాజా టీ20 ప్రపంచకప్‌లో ప్రస్థానం ఆరంభిస్తోంది. ఈ ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్యానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీ రాలేదు. టోర్నీ సాంతం జట్టు రాణించినా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతోంది. ఇప్పుడు ఎంఎస్ ధోనీ రాకతో ఆ బలహీనత కాస్త తగ్గే అవకాశం ఉంది. ఫీల్డర్ల మోహరింపు, పిచ్ అధ్యయనం, వాతావరణం, పరిస్థితులు, వ్యూహాల్లో అతడి భాగస్వామ్యం జట్టుకు కొండంత బలం కానుంది.
Continues below advertisement