మేషం
మేషరాశివారికి ఈ రోజంతా శుభసమయమే. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు . వివాహితులు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
వృషభం
అనవసర ఖర్చులు తగ్గుతాయి. పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. కార్యాలయ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు.  వ్యాపారులకు శుభసమయం.  కొత్త  ప్రణాళికను రూపొందించవచ్చు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులకు శుభదినం.
మిథునం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.  కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారం బాగానే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పెట్టుబడుల్లో లాభం ఉంటుంది. బంధువుల నుంచి సహాయం పొందుతారు. 
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
కర్కాటకం
అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనికి సంబంధించి మీ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది.  యువత కెరీర్‌లో ముందుకు సాగుతారు.
సింహం
మీరు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపికగా ఉండాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం ముఖ్యం. బాధ్యతలను విస్మరించవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా విభేదాలు ఉండొచ్చు. అనవసర మాటలు వద్దు.  వ్యాపారంలో లాభాలొస్తాయి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
కన్య
ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  ఏదైనా పనిని పూర్తి చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు మీకు సహాయపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. యువత ఈరోజు శుభవార్త పొందుతారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.
Also Read: దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది .. బండ్ల గణేష్ ట్వీట్ లో ఏముంది..వాస్తవం ఏంటి..!
తుల
కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు మంచిరోజు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది.  ఆలోచించకుండా ఏ పని చేయవద్దు. పెట్టుబడి పెట్టే ఆలోచన మానుకోండి.  అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. సామాజిక సేవ చేస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. కొత్త పనులు చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల సహాయం అందుతుంది. ప్రత్యర్థుల వల్ల మీ పనిపై కొంత ప్రభావం ఉంటుంది. కోపంతో ఏదైనా తప్పు చేసే అవకాశం ఉంది. మీరు మాత్రమే గొప్ప అనే ఫీలింగ్ వదిలిపెట్టండి. 
ధనుస్సు
ఈ రోజు మీరు మానసికంగా బలంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు.  ప్రైవేట్ రంగంలో ఉన్నవారు ఏదైనా ప్రయోజనం పొందుతారు.  స్నేహితులతో మంచి సమయం గడపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు చాలా ఆహ్లాదకరమైన రోజు అవుతుంది.
Also Read: శరీరంలో ఉండే ఈ పది వాయువుల గురించి తెలుసా?
మకరం
ఈ రోజు  మీ ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపార పరిస్థితులు బావుంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.  విద్యార్థులకు ఈరోజు శుభదినం. కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి.ఎవరికైనా సహాయం చేస్తే మానసిక ప్రశాంతతని పొందుతారు.
కుంభం
ధనం లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.  కుటుంబ కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. పనికి సంబంధించి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారానికి సంబంధించి చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి. 
మీనం
మీరు కొత్త సమాచారాన్ని పొందుతారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.   మతపరమైన పనుల్లో భాగమవుతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసొచ్చే రోజిది.
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి