వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేసి దశకంఠుడి మరణం తర్వాత లంక నుంచి శ్రీరామచంద్రుడిని, పరివారాన్ని ...విభీషణుడు పుష్పకవిమాంలో అయోధ్యకు తీసుకెళతాడు. మార్గ మధ్యలో పుష్పక విమానం ఆగిన ఒకే ఒక ప్లేస్ కిష్కింద. అక్కడున్న వానరుల భార్యలను కూడా శ్రీరామ పట్టాభిషేకం చూసేందుకు తీసుకెళ్లేందుకు ఆగుతుంది పుష్పకవిమానం. ఈ కబురు ముందే అయోధ్యకు చేరవేసేందుకు ఆంజనేయుడు వెళతాడు. దశకంఠుడిని ఓడించినందుకు గుర్తుగా కూడా దసరా జరుపుకుంటారని... అయోధ్యకు రాముడు తిరిగివచ్చిన రోజున రాజ్యంలో ప్రజలంతా దీపావళి జరుపుకున్నారని కూడా చెబుతారు. పురాణాల్లో ఇప్పటి వరకూ ఉన్న ప్రస్తావన ఇది మాత్రమే అంటున్నారంతా.
అయితే ఇదే విషయానికి సంబంధించి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేశ్.
ఏటా దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుంచి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణములో చెప్పారని మరో ట్వీట్ చేశారు.
504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ, నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!! అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్
ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుంచి మనము దసరా, దీపావళిని జరుపుకుంటాం. మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండిఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండంటూ బండ్ల ట్వీట్ వైరల్ అవుతోందిప్పుడు.
Also Read: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగే...థియేటర్ల లోనూ సందడే సందడి
Also Read: నువ్వు ఇక్కడ లేకపోయినా భయం వేస్తోంది..సమంత పోస్ట్ వైరల్...
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్
Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి