'నాట్యం': కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయమవుతూ నిర్మిస్తోన్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కమల్‌కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మేనన్ ముఖ్యపాత్రలో నటించారు.
'అసలేం జరిగింది ' : యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
'మధుర వైన్స్': సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మధురవైన్స్’ కూడా అక్టోబరు 22నే విడుదల కానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి. వీళ్లద్దరి మధ్య ప్రేమ కథే 'మధుర వైన్స్'.
'హెడ్స్ అండ్ టేల్స్': సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించగా నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.
Also Read: నువ్వు ఇక్కడ లేకపోయినా భయం వేస్తోంది..సమంత పోస్ట్ వైరల్...Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి