టాలీవుడ్ స్టార్స్‌లో చాలామందికి తమిళ్ వచ్చు. ముఖ్యంగా వారసులుగా చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన వాళ్లకు! ఎందుకంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వకముందు చెన్నైలో ఉంది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు నుండి మొదలుపెడితే... చిరంజీవి వరకూ చెన్నైలో ఉండి తెలుగు సినిమాలు చేసినవాళ్లే. అక్కడ ఉండటంతో వాళ్ల పిల్లలకు కూడా తమిళం వచ్చింది. వాళ్లందరూ తమిళం మాట్లాడతారు. ఇప్పుడు లక్ష్మీ మంచు తమిళం మాట్లాడుతున్నారు. అదీ ఓ సినిమా కోసం!
లక్ష్మీ మంచు ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నారు. ఏ సినిమాలో నటిస్తున్నదీ చెప్పలేదు. ప్రొడక్షన్ హౌస్ వివరాలు వెల్లడించేవరకూ ఎదురు చూడాలని కోరారు. అయితే... తమిళ్ మాట్లాడటం అమేజింగ్ గా ఉందని పేర్కొన్నారు. అంతే... యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్ తమకు పని కల్పించుకున్నారు. లక్ష్మీ మంచు మీద సెటైర్లు షురూ చేశారు.
"ఇంటర్నేషనల్ అక్కా ... నువ్వు నాన్-తమిళ్ అంటారు ఏమో? రిలీజ్ కు ముందు! జాగ్రత్త" అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విష్ణు మంచు విజయం సాధించారు. ఎన్నికలకు ముందు అతడితో పాటు అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ జన్మతః కన్నడిగ కావడంతో అతడు నాన్ లోకల్ అని విష్ణు మద్దతుదారులు కొందరు వ్యాఖ్యానించారు. దానికి సెటైర్ అన్నమాట ఈ ట్వీట్. ఇంకో నెటిజన్ "ముందు తెలుగు నేర్చుకో తల్లీ" అని అన్నారు.
"మీరు ఇంగ్లిష్ ఉచ్చారణ ఎలా ఉండాలో వివరిస్తారు కదా! 'లవ్'లో 'వి' అలా రోల్ అవ్వాలని! తమిళంలో కూడా అలా రోల్ అవుతూ ఉంటాయా అక్కాయ్" అని ఇంకో నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఈ విధంగా పలువురు వెటకారంగా స్పందించారు. తమిళనాడు అంతా ఒక్కటే యాస మాట్లాడరు. ప్రాంతానికి తగ్గట్టు యాస మారుతూ ఉంటుంది. సినిమాలో లక్ష్మీ మంచు ఏ యాస మాట్లాడతారో మరి? అన్నట్టు... తమిళంలో ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడల్' సినిమాలో లక్ష్మీ మంచు నటించారు. ఆ సినిమా తెలుగులో 'కడలి' పేరుతో విడుదలైంది. ఇప్పుడు చేస్తున్నది ఆమె రెండో తమిళ సినిమా.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?