తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మేయర్ గా సుంకర శివ ప్రసన్న ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ను ఎన్నుకున్నారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మంత్రి కురసాల కన్నబాబుతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.  కాకినాడ కార్పొరేషన్ కు సంబంధించి ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు ఉండగా ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన టీడీపీకి చెందిన మేయర్ సుంకర పావని, డిప్యూటీ  మేయర్ లపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ అసమ్మతి, బీజేపీ కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం 36 మంది జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. 




Also Read:  ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు


టీడీపీ అసమ్మతి వర్గం నుంచి మేయర్ ఎంపిక


దీంతో ప్రభుత్వం నూతన మేయరు ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ  ఆదేశాల మేరకు సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. టీడీపీ అసమ్మతి వర్గం నుంచి 40వ వార్డుకు చెందిన శంకర శివ ప్రసన్న మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు వైసీపీ కండువాలతో హాజరయ్యారు. టీడీపీ పార్టీ కార్పొరేటర్లు అసమ్మతి వాదన వినిపించి వైసీపీతో కలిసి తన మేయర్ పదవికి ఇబ్బందులు సృష్టించారని మాజీ మేయర్ సుంకర పావని హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెలువడనుంది. అయితే సుంకర  పావనిపై అసమ్మతి వాదన వినిపించిన సమయంలో సమావేశానికి హాజరైన తొమ్మిది మంది టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతికి వ్యతిరేకంగా చేతులు ఎత్తకపోవడం గమనార్హం.


Also Read:  టీడీపీ గుర్తింపు రద్దుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం... వైసీపీ నేత సజ్జల కామెంట్స్.. ఏపీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలు


కుట్రలు చేసి పదవి నుంచి దింపేశారు : మాజీ మేయర్  


మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కుట్రలు చేసి మహిళను మేయర్ పదవి నుంచి దింపేసిందని మాజీ మేయర్ సుంకర పావని విమర్శిస్తున్నారు. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆమె ఎమ్మెల్యే ద్వారంపూడిపైనే ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తిరుగుబాటు చేసిన కార్పొరేటర్ల వాదన మరోలా ఉంది. సహచర కార్పొరేటర్లమైన తమకు మేయర్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఇన్నాళ్లు ఓపికతో భరించామని ఇక భరించలేమన్నారు. 




Also Read: కాకినాడ మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు ! అవి పదవి నుంచి తొలగించడమే....


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి