హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది. దాదాపు నలభైఏళ్ల కష్టం ఈ అద్భుతమైన దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం. శివుడికి జటల నుంచి వచ్చి పేరే జటోలి. ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలుపురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట. ఆ తర్వాత స్వామి కృష్ణానంద్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు-ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది.-ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.-ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్లో , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం, వినాయకుడి విగ్రహం ఉంటుంది.-ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు శివ, పార్వతి విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు.-ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం.- అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద.. శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని..అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు.- ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి.
Jatoli Shiv Temple: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
ABP Desam | RamaLakshmibai | 25 Oct 2021 12:42 PM (IST)
ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం. నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట. ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా... ఆ విశేషాలు చూద్దాం...
Jatoli Temple
Published at: 25 Oct 2021 12:42 PM (IST)