నగ్నంగా వీడియో కాల్స్ చేస్తారు.. అవతలి వారిని అదే రూట్ లోకి తీసుకొస్తారు. ఇక నమ్మి వీడియో కాల్ చేయగానే.. తమ పని మెుదలుపెడతారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఉత్తర​ప్రదేశ్​ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇప్పటి వరకూ ఎవరూ.. కంప్లైంట్ ఇవ్వలేదు.. అయితే మరో కేసు దర్యాప్తు చేస్తుంటే పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. 300 మందిని మోసం చేసి.. రూ.20 కోట్లు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్యాభర్తలతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.


ఒక్కొక్కరింది ఒక్కో పాత్ర


యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన సప్నా గౌతమ్‌, యోగేశ్‌ భార్యాభర్తలు. ఈ జంటకు ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. ఈ దంపతులకు ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి.. ఓ సలహా ఇచ్చాడు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడించి.. రికార్డు చేస్తే.. డబ్బులు లాగొచ్చని చెప్పాడు. అనుకున్నదే పనిగా ఈ దందాలోకి దిగారు భార్యాభర్తలు. అయితే ఇందులో దంపతులు తమ పనిని విభజించుకున్నారు. వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం యోగేశ్ పని. సేకరించిన వివరాలతో వీడియో కాల్స్ మాట్లాడటం.. కొంతమంది యువతులకు శిక్షణ ఇచ్చి.. ఇవే పనులు చేయించడం సప్నా చూసుకుంటోంది. 


అలా మాట్లాడితే నిమిషానికి 234 రూపాయలు


అయితే దీని కోసం ముందుగా ఈ దంపతులు ఓ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకున్నారు. కొత్త ఐడీలు క్రియేట్ చేసి.. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దీని కోసం నిమిషానికి 234 రూపాయలు చెల్లించాలి. ఇందులో సగం వెబ్ సైట్ వాళ్లకి.. మిగిలిన సగం వీళ్లకి చేరుతుంది.  ఆ రేటు కంటే.. తక్కువకే తాము వీడియోలు చూపిస్తామంటూ.. బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. డైరెక్ట్ గా వారికే వాట్సాప్ లేదా ఇతర దారుల్లో వీడియో కాల్స్ చేస్తారు. అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేస్తారు.  ఆ టైమ్ లోనే వారు చేసే పనులు రికార్డు చేస్తారు. తర్వాత ఈ దంపతులు తమ పనిని మెుదలు పెడతారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుటే.. వీడియోలు బయట పెడతామని బెదిరిస్తారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి.. సుమారు 20 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.


న్యూడ్ కాల్స్, చాట్ కి జీతాలు


వీళ్లకి పక్కా.. ప్లాన్ ఉంది. యువతులను కూడా తమ దందాలో రిక్రూట్ చేసుకున్నారు. నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించేవారు. కేవలం  సందేశాలు మాత్రమే చేసే వారికి రూ.15వేలు ఇచ్చేవారు. వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసేవారు. ఎవరికీ దొరకొద్దని.. కొత్త నంబర్లు, తాము ఉంటున్న ప్రదేశాలను మార్చేవారు. అయితే దీనిపై బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. 
ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ దందా బయటకు వచ్చింది. తమ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేసినట్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ కేసు విచారణలో వారు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే దర్యాప్తు చేస్తుంటే.. హనీ ట్రాప్ విషయం బయటపడింది. భార్యాభర్తలు సహా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Also Read: India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...


Also Read: Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...