భారత మార్కెట్‌లో బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,830 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,900గా ముందు రోజుతో పోలిస్తే స్థిరంగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,900గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,900 గా ఉంది.


Also Read: రిలయన్స్‌ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్‌.. లాభం ఎంతో తెలుసా?


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,660గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,160 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.


ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం నేడు పెరిగింది. గ్రాముకు రూ.52 వరకూ పెరిగిన ధర నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,501 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్‌ పెంపునకు ప్రభుత్వ ఆమోదం


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..


Also Read: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి