ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్‌ను మూడు శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2021, జులై 1 నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్/డీఏ 28 శాతంగా ఉంది. ఇప్పుడు పెంచిన మూడు శాతంతో అది 31కి చేరుకుంటుంది. కేంద్ర నిర్ణయంతో 47. 14 లక్షల ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత పెంపు వల్ల ఏటా ఖజానాపై రూ.9,488 కోట్ల భారం పడనుందని ప్రభుత్వం తెలిపింది.
డీఏను ఈ మధ్యే రీస్టోర్ చేసినప్పటికీ 2021 జులై, ఆగస్టులో పెంచిన డీఏను ఇంకా చెల్లించలేదు. అయితే డీఏ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పీఎఫ్ చందాదారులకూ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020-21 కాలానికి పెట్టుబడులపై వడ్డీని జమ చేస్తామని పేర్కొంది. ఇతర డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులకూ ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు....మీ నగరంలో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి…
Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం
Also Read: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!
Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి