తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా ఇప్పుడు ప్లీనరీ మూడ్‌లో ఉన్నారు. కానీ  ఈ ప్లీనరీకి హరీష్ రావుకు ఆహ్వానం లేదు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదు  హుజురాబాద్ ఎన్నికల పనులు చూసుకుంటున్న ఎవరికీ ఆహ్వానం లేదు. అందరూ ఎన్నికల పనుల్లోనే బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్‌తో పాటు హుజూరాబాద్‌లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పినట్లుాగ తెలుస్తోంది.  అక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు. 


Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !


టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొనాలని నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. కానీ వారికి ఎన్నికల బాధ్యతలు అడ్డు వస్తున్నాయి. గత ఐదు నెలలుగా నియోజకవర్గం ఆంతటా కలియ తిరుగుతున్న వారంతా పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈనెల 30నే పోలింగ్ జరగనున్నందున అందరు ఒక్క సారిగా ప్లీనరీకి తరలి వస్తే హుజురాబాద్‌లో ఒక రోజు పూర్తిగా టీఆర్ఎస్ యాక్టివిటీ ఆగిపోతుందని అది పార్టీకి నష్టం చేస్తుందని టీఆర్ఎస్ హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తోంది.

 


Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి


నిజానికి ప్లీనరీకి హాజరయ్యే వారిసంఖ్యను కూడా పరిమితం చేశారు. మొదట్లో పదిహేను వేల మంది వరకూ అంచనా వేశారు.  కానీ తర్వాత కేసీఆర్ కేవలం ఆరు వేల మందితోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు . దీంతో స్థాయిలను బట్టి ఆహ్వానాలు పంపుతున్నారు.  వారు మాత్రమే హాజరవుతారు. ఏ స్థాయిలో ఉన్నా హుజురాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు హాజరయ్యే అవకాశం లేదు.

 


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం హైదరాబాద్ వచ్చారు. ప్రతి నియోజవకర్గం నుంచి యాభై మందికి ఆహ్వానాలు పంపారు. ఆహ్వానాలు పంపిన వారిని మాత్రమే అనుమతిస్తారు. అయితే ప్లీనరీలో పాల్గొనకపోయినా అనేక మంది టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు హైదరాబాద్ మొత్తాన్ని గులాబీ మయం చేయడంతో సందడి నెలకొంది. 


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి